మేత కోసం వచ్చి రెండు నక్కలు వ్యవసాయ బావిలో పడి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని చూసి రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు, ఈ సంఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో చోటుచేసుకుంది. బొమ్మెన గ్రామ శివారులో మేత కోసం వచ్చిన రెండు నక్కలు వ్యవసాయ బావిలో పడ్డాయి. ఈదుకుంటూ బావిలోని సొరంగంలో చొరబడ్డాయి. దీనిని గమనించిన రైతు ఆ రెండు నక్కలను కాపాడేందుకు ప్రయత్నం చేశాడు,అయినా బయటకు రాలేకపోవడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో శుక్రవారం మధ్యాహ్నం రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ముషీరుద్దీన్ సిద్ధికి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మధుసూదన్,నక్కలను బయటకు తీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినప్పటికీ బయటకు రాకపోవడంతో శనివారం ఉదయం మళ్లీ వలల ద్వారా రెండు నక్కలను సురక్షితంగా బయటకు తీసి అడవిలోకి వదిలేసారు. 24 గంటలు శ్రమించడంతో రెండు నక్కల ప్రాణాలను కాపాడినట్లు అయింది.