Adilabad: చలాన్లు కట్టలేక బైక్‌కు నిప్పంటించిన వాహనదారుడు..
Adilabad: ట్రాఫిక్ చలాన్లు కట్టలేక విసుగెత్తి ఓ వాహనదారుడు బైక్ తగలబెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.;
Adilabad (tv5news.in)
Adilabad: ట్రాఫిక్ చలాన్లు కట్టలేక విసుగెత్తి ఓ వాహనదారుడు బైక్ తగలబెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. వారం క్రితమే వెయ్యి రూపాయలు చలాన్ కట్టినట్లు చెప్పాడు వాహనదారుడు. ఇవాళ మరోసారి తనిఖీలు చేసిన అధికారులు.. చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో డబ్బులు కట్టారని అడిగారు. వారం కిందటే కట్టానని.. ఇప్పుడు మళ్లీ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలంటూ అసహనానికి గురైన వాహనదారుడు బైక్ కు నిప్పంటించాడు. నీళ్లు తీసుకొచ్చి మంటలార్పిన ట్రాఫిక్ పోలీసులు.. డ్యూటీలో భాగంగానే జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు.