Lockdown: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద రద్దీ..!
Lockdown: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కూలీలు స్వస్థలాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు;
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కూలీలు స్వస్థలాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు. రెండో దశలో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, లాక్‌డౌన్‌ను మళ్లీమళ్లీ పొడిగిస్తూ పోతారనే అపోహల మధ్య ఇంటి బాట పడుతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రయాణికులు భారీగా తరలివస్తున్నారు రిజర్వేషన్లు ఉన్నవారిని అనుమతిస్తున్నారు. రైల్వే స్టేషన్ ఆవరణలో చెట్ల కింద ఉంటూ తమ రైలు బయల్దేరే సమయం వరకు నిరీక్షిస్తున్నారు. అయితే రిజర్వేషన్లు లేని వారు తిరిగి ఇంటికి వెళ్దామంటే బస్సులు, ఆటోలు లేక నానా అవస్థలు పడుతున్నారు.