TG : వచ్చే నెల 9 లోపు పూర్తి రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల

Update: 2024-11-10 07:30 GMT

డిసెంబర్ 9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో నూతనంగా నిర్మించిన సహకార సంఘం భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశాం.. రాష్టంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అన్నారు. దేశంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి పేర్కొన్నారు. అలాగే పెండింగులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News