TG : గణపతి బప్పా మోరియా...కావాలయ్య యూరియా.. ఖాళీ బస్తాలతో బీఆర్ఎస్ నేతల నిరసన..

Update: 2025-08-30 07:15 GMT

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో సభకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతన్నలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన యూరియా కొరత పై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఖాళీ బస్తాలతో నిరసన వ్యక్తం చేశారు. 'గణపత్తి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా' అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన యూరియా సరఫరా చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News