నిండిపోయిన గండిపేట చెరువు.. ఇళ్లు ఖాళీ చేయాలని చాటింపు వేయిస్తున్న అధికారులు

Update: 2020-10-21 15:34 GMT

భారీ వర్షాలు.. వరదలతో గండిపేట చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో.. ఏక్షణంలోనైనా గండిపేట చెరువు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. స్థానిక ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ పరిధిలో.. ప్రజలను అలర్ట్‌ చేస్తున్నారు. గండిపేట గేట్లు ఎత్తివేసే అవకాశంతో లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్ అయ్యారు. అటు.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చాటింపు వేయిస్తున్నారు. గండిపేట రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుతం 1787.50 ఫీట్ల వరకు నీరు చేరింది. అటు.. 888 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

Tags:    

Similar News