గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ మొదటివారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీపావళి తర్వాత ఏ క్షణమైనా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. మరోవైపు... జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మంత్రులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఇక అటు... 11 పార్టీలతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.