ఆస్తిపన్ను వసూళ్లకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బకాయిలపై దృష్టిసారించిన సర్కార్ 2025-26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను చెల్లింపుపై జీహెచ్ఎంసీ కొత్త స్కీం ప్రవేశపెట్టింది. ఆస్తిపన్ను చెల్లింపు దారుల ప్రయోజనం కోసం ఎర్లీ బర్డ్ స్కీంను బల్దియా ప్రవేశపెట్టింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా ఆస్తి పన్ను ఏప్రిల్ 30వ తేదీ లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఎర్లీ బర్డ్ స్కీం అందుబాటులో ఉండనుంది. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నుకు మాత్రమే ఎర్లీ బర్డ్ స్కీం వర్తింస్తుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై ఎర్లీ బర్డ్ స్కీం వర్తించని విషయం తెలిసిందే. నేటితో 2024-25 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను ఓటీఎస్ స్కీం ముగియనుంది. ఆస్తి పన్ను వసూలుకు మరో ముందడుగుగా ఎర్లీ బర్డ్ స్కీంను జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది.