జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ కసరత్తు

Update: 2020-11-18 01:54 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా GHMC ఎన్నికలే ప్రధాన అంశంగా టీఆర్ ఎస్ పార్లమెంటరీ, శాసన సభాపక్ష సమావేశం నిర్వహించున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఆదేశించారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తమ పరిధిలోని డివిజన్ల బాధ్యతలను అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన డివిజన్ల సమాచారాన్ని వారికి ఇప్పటికే అందించారు. అభ్యర్ధుల ప్రకటన నేపథ్యంలో.. అసమ్మతి నేతలను బుజ్జగించే విధానాలను వివరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహాలను వారికి వివరించనున్నారు. తమ పరిధిలోని కార్పోరేటర్లు విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.


Tags:    

Similar News