GHMC: జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటైన జోన్లు ఇవే!

జీహెచ్ఎంసీలో కొత్తగా ఆరు జోన్లు ఏర్పాటు

Update: 2025-12-26 07:00 GMT

జీహెచ్ఎంసీలో కొత్తగా ఆరు జోన్లు ఏర్పాటు అయ్యాయి. కొత్త జోన్లలో గోల్కొండ, శంషాబాద్, ఉప్పల్, రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్ ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాంతాలలో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలానే వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు.

 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లు 

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ  పునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ ఆరు జోన్లు, 30 సర్కిళ్లుగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి.. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లకు పెరిగింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహా విస్తరణ చేపట్టింది.  ఇందులో భాగంగా 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలి వరకు 2053చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. జీహెచ్‌ఎంసీ అవతల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసుకొని 300 డివిజన్లతో మహా హైదరాబాద్‌ను నిర్ణయించింది. దీంతో జీహెచ్‌ఎంసీలో జోన్ల సంఖ్యను ఆరు నుంచి 12కి పెంచారు. 30 సర్కిళ్లను 60 సర్కిళ్లు చేశారు. కొత్త జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాలను కూడా ఖరారు చేశారు. తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంతో పెరిగిన పరిధిని 300 వార్డులుగా ఖరారు చేశారు.

కొత్తగా ఏర్పాటైన జోన్లలో గోల్కొండ, శంషాబాద్, ఉప్పల్, రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్ ఉన్నాయి. త్వరలోనే వీటిల్లో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలానే వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. త్వరలోనే వీటి ద్వారా పాలన కొనసాగుతుంది. అలానే జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనపై కూడా ఫైనల్ నోటిఫికేషన్ వెల్లడించింది. వార్డుల సంఖ్యలను 300కు ఖరారు చేశారు. 10 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6వేలకు పైగా అభ్యంతరాలు రాగా.. సహేతుకమైన వాటిని పరిగిణనలోకి తీసుకొని తుది నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News