వాసాలమర్రిలో దళిత బంధు అమలుకు జీవో జారీ..!
76 దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తూ.. 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.;
వాసాలమర్రిలో దళిత బంధు అమలుకు జీవో జారీ అయ్యింది. 76 దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తూ.. 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిన్న వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించడం.. ఇవాళ దళిత బంధు జీవో రావడం వెంటవెంటనే జరిగిపోయాయి. మొదట ఆగస్టు 16న హుజురాబాద్‌లో దళిత బంధు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఐతే.. అనూహ్యంగా ఇవాళ్టి నుంచే వాసాలమర్రిలో దళిత బంధు అమలులోకి వచ్చింది.