ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్-2024)కు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 20 వరకు అప్లికేషన్లకు అవకాశం కల్పిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. నిజానికి టెట్ దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నది.
అయితే ఈసారి టెట్ అప్లికేషన్లు గణనీయంగా తగ్గాయి. మూడు లక్షల అప్లికేషన్లు వస్తాయని తెలంగాణ విద్యాశాఖ అధికారులు భావించినా ఇప్పటి వరకు రెండు లక్షలు కూడా దాటలేదు. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి.
ఈసారి అప్లికేషన్ ఫీజు రూ.1000 నిర్ణయించడం కూడా అభ్యర్థుల అనాసక్తికి ఒక కారణంగా తెలుస్తోంది. ఫీజు ఎక్కువ పెట్టడంపై అభ్యర్థులు బాహాటంగానే తమ నిరసన తెలిపారు.