Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్... APP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...
స్వాతంత్ర దినోత్సవ వేళ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 285 ఏపీపీ పోస్టులు ఉండగా.. వాటిలో 120 మంది మాత్రమే సర్వీసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 118 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు లా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్మెంట్ తప్పనిసరి. అదే విధంగా రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. జూలై 2025 నాటికి 34 ఏళ్లు మించకూడదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక https://www.tgprb.in/ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాత పరీక్ష విధానంలో మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉండనుంది.