Nagarjuna Sagar : పర్యాటకులకు గుడ్ న్యూస్.. నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత..

Update: 2025-07-29 08:45 GMT

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలే కాకుండా ఎగువ రాష్ట్రాల నుండి వస్తున్న వరదల నేపథ్యంలో జలాశయాలు నిండు కుండల మారుతున్నాయి. కృష్ణ నదికి వరద ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు .దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణమ్మ సాగర్ వైపు దూసుకొస్తోంది. ఈ క్రమంలో నాగార్జున సాగర్ జలాశయం కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.60 అడుగుల వద్ద నీరు ఉంది. జూరాల, శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో 2,01,743 క్యూసెక్కులు గా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈరోజు ఉదయం స్ధానిక ఎమ్మెల్యే రఘువీర రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, అధికారులు సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గేట్లను ఎత్తే నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు అధికారులు. ఇక సాగర్ గేట్లు ఎత్తడంతో పొంగుతున్న కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఎగసి పడుతున్న జల దారలను తమ కెమెరాల్లో బండిస్తున్నారు నేచర్ లవర్స్.

Tags:    

Similar News