Nagarjuna Sagar : పర్యాటకులకు గుడ్ న్యూస్.. మళ్లీ తెరుచుకున్న సాగర్ గేట్లు
తెలంగాణ కృష్ణా బేసిన్ లోని అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జునసాగర్ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. ఎగువ కురుస్తున్న వర్షాలతో సాగర్‌కు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 32 వేల 400 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 76 వేల 555 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా నమోదైంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉంది.