Minister Harish Rao : ఆయిల్ ఫామ్ సాగు డ్రిప్‌కు 90 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తోంది..!
దేశంలో అత్యథికంగా తెలంగాణలోనే వరి పండిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లోని పల్లె ప్రగతి ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.;
దేశంలో అత్యథికంగా తెలంగాణలోనే వరి పండిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లోని పల్లె ప్రగతి ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా.... ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని... ఏడాదికి రూ.60 వేల కోట్ల పామాయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అయిల్‌ఫామ్ సాగుకు డ్రిప్‌కు 90 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తోందన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా రైతులు సాగు చేసి, వ్యవసాయ రంగంలో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణను నిలపాలని సూచించారు.