khairatabad ganesh : ఖైరతాబాద్‌ మహాగణపతికి గవర్నర్‌ తమిళసై తొలిపూజ..!

khairatabad Ganesh : ఖైరతాబాద్‌ మహాగణపతి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. విఘ్నేశ్వరుడికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ నిర్వహించారు.

Update: 2021-09-10 07:30 GMT

khairatabad Ganesh : ఖైరతాబాద్‌ మహాగణపతి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. విఘ్నేశ్వరుడికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ నిర్వహించారు. కుటుంబ సమేతంగా తమిళిసై ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా గణపతిని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ దంపతులు కూడా దర్శించుకుని పూజలు చేశారు.

ఖైరతాబాద్‌ గణపతి మండపం వద్దకు సీఎం కేసీఆర్‌ 5అడుగుల మట్టి గణపతి విగ్రహం పంపించారు. ఇకపై ఖైరతాబాద్‌లో మట్టి గణపతిని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి... గణనాథుడిని దర్శించుకున్నారు.

ఖైరతాబాద్‌ గణేషుడు... ఈ సారి పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. 40 అడుగుల ఎత్తులోని భారీ గణనాథుడిని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాగణపతికి ఇరువైపులా... కృష్ణకాళి, కాల నాగేశ్వరి దర్శనం ఇస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విఘ్నేశ్వరుడిని దర్శించుకునేలా ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది. గతేడాది కొవిడ్‌ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. లడ్డు వేలం పాట కూడా రద్దు చేశారు. కానీ ఈ సారి లడ్డు వేలం పాట ఉంటుందని ఉత్సవ సమితి వెల్లడించింది.

Tags:    

Similar News