నల్గొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
గార్ల మండలం 175 పోలింగ్ కేంద్రంలో.. 603 ఓట్లు పోల్ కాగా.. లెక్కింపులో 31 ఓట్లు తగ్గాయని ఏజెంట్లు ఆందోళనకు దిగారు.;
నల్గొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు ఏజెంట్లు ఆందోళనకు దిగారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం 175 పోలింగ్ కేంద్రంలో.. 603 ఓట్లు పోల్ కాగా.. లెక్కింపులో 31 ఓట్లు తగ్గాయని ఏజెంట్లు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై పలువురు ఏజెంట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.