Jadala Ramalingeswara Temple : కన్నుల పండువగా జడల రామలింగేశ్వరుని కల్యాణం
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు లో తెలంగాణ శ్రీశైలం గా పిలువబడే శ్రీ పార్వతీ జడల రామలింగే శ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్స వాలు ఘనంగా నిర్వహించారు. రధసప్తమి రోజున స్వామివారి కళ్యాణం జరగడం ఇక్కడి విశేషం. అందులో భాగంగానే ఇవాళ తెల్లవారుజామున శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభు త్వం తరుపున స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పట్టు వస్రాలను, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ముందుగా స్వామి అమ్మ వార్ల ఉత్సవ విగ్రహాలను వృషభ వాహనంపై ఆలయం పురవీధుల గుండా అశేష భక్త సంద్రం వీక్షిస్తుండగా ఊరేగింపుగా కళ్యాణ మండపంలో ఆసీనులుగా చేసి మాఘ శుద్ధ సప్తమి గడియాలో స్వామి కల్యాణ తంతును పూర్తి చేశారు. స్వామివారి కల్యాణాన్ని తిల కించడానికి పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల కొంగుబంగా రమైన స్వామి వారి కల్యాణ్యాన్ని తిలకించారు.