GROUP 1: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Update: 2025-09-09 05:45 GMT

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ ను రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి మెయిన్స్ పలితాలను విడుదల చేయాలంది. అలాగే రీవాల్యుయేషన్‌కు 8 నెలల్లో సమయం ఇచ్చింది. గ్రూప్‌-1 పరీక్షా మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలను రద్దు చేసి, మరోసారి పరీక్షాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలి అని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. అర్హత సాధించిన అభ్యర్థులను ఉద్వేగపరిచింది. అయితే మొదట రీ-వాల్యుయేషన్ నిర్వహించాలని, వాటిపై అభ్యంతరాలు వస్తేనే మళ్లీ పరీక్షను నిర్వహించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చింది. రీవాల్యుయేషన్‌కు 8 నెలల్లో సమయం ఇచ్చింది. ఈ తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది.

Tags:    

Similar News