మురికి కాలువల్లో నివసించే వారిని మంచి ప్రదేశంలో పెట్టడం మంచి పరిణామమన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నేతలు పరుష పదజాలం వాడటాన్ని జనాలు ఒప్పుకోవడం లేదన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన వారు ఉద్యోగాలను భర్తీ చేస్తే అయిపోయేది కదా అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తలసాని టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి కాలేదా అన్నారు. మూసీ విషయంలో టెండర్లే పిలవనిది దోచుకునేది ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఫిరాయింపుల విషయంలో కోర్టు ఇచ్చే సమాధానం ఏంటో చూస్తామన్నారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక వనరులు సరిగ్గా ఉన్నా లేకపోయినా బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి రుణమాఫీ చేయడం సాధ్యం కాదని… అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు.