Harish Rao : సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా: హరీష్‌రావు
Harish Rao : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.;
Harish Rao : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. కోకాపేటలోని తన నివాసం నుంచి బయల్దేరిన హరీష్.. బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హరీష్ వెంట మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆలయానికి వెళ్లారు.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కిందని హరీష్‌రావు అన్నారు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవెర్చేలా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం హరీష్‌రావు అసెంబ్లీకి బయలుదేరారు..