TG: నేడు సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ల విచారణ

దానం, కడియం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అన్న స్పీకర్

Update: 2026-03-12 04:00 GMT

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానం గడపకు చేరింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల వ్యవహారం రేపు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సహా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఈ ఫిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ వారు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో గత కొ­న్ని నె­ల­లు­గా చర్చ­నీ­యాం­శం­గా మా­రిన ఎమ్మె­ల్యేల అన­ర్హత వ్య­వ­హా­రం­పై అసెం­బ్లీ స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ కు­మా­ర్ కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. ఖై­ర­తా­బా­ద్ ఎమ్మె­ల్యే దానం నా­గేం­ద­ర్, స్టే­ష­న్ ఘన్‌­పూ­ర్ ఎమ్మె­ల్యే కడి­యం శ్రీ­హ­రి పై దా­ఖ­లైన అన­ర్హత పి­టి­ష­న్ల­ను స్పీ­క­ర్ కొ­ట్టి­వే­శా­రు. ఇద్ద­రు ఎమ్మె­ల్యే­లు పా­ర్టీ మా­రి­న­ట్లు స్ప­ష్ట­మైన ఆధా­రా­లు లే­వ­ని స్పీ­క­ర్ తన ని­ర్ణ­యం­లో పే­ర్కొ­న్నా­రు. ఈ ని­ర్ణ­యం­తో ఈ ఇద్ద­రు ఎమ్మె­ల్యే­ల­కు పె­ద్ద ఊరట లభిం­చ­గా, పా­ర్టీ ఫి­రా­యిం­పుల ఆరో­ప­ణ­లు ఎదు­ర్కొం­టు­న్న మొ­త్తం పది మంది ఎమ్మె­ల్యే­ల­కు స్పీ­క­ర్ క్లీ­న్ చిట్ ఇచ్చి­న­ట్లైం­ది. తె­లం­గాణ అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో 2024లో బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ తర­పున గె­లి­చిన కొం­త­మం­ది ఎమ్మె­ల్యే­లు తరు­వాత కాం­గ్రె­స్ ప్ర­భు­త్వా­ని­కి మద్ద­తు­గా వ్య­వ­హ­రి­స్తు­న్నా­ర­ని ఆరో­ప­ణ­లు రా­వ­డం­తో ఈ వ్య­వ­హా­రం పె­ద్ద రా­జ­కీయ చర్చ­కు దారి తీ­సిం­ది. ము­ఖ్యం­గా ఖై­ర­తా­బా­ద్ ఎమ్మె­ల్యే దానం నా­గేం­ద­ర్, స్టే­ష­న్ ఘన్‌­పూ­ర్ ఎమ్మె­ల్యే కడి­యం శ్రీ­హ­రి పై బీ­ఆ­ర్ఎ­స్ నా­య­కు­లు అన­ర్హత పి­టి­ష­న్లు దా­ఖ­లు చే­శా­రు. అలా­గే బీ­జే­పీ తర­ఫున కూడా ఈ అం­శం­పై అభ్యం­త­రా­లు వ్య­క్త­మ­య్యా­యి. మొ­త్తం పది మంది బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే­లు కాం­గ్రె­స్ పా­ర్టీ­లో చే­రా­ర­ని ఆరో­పి­స్తూ బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు అసెం­బ్లీ స్పీ­క­ర్‌­కు ఫి­ర్యా­దు చే­శా­రు. ఈ నే­ప­థ్యం­లో స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ కు­మా­ర్ ఈ అం­శం­పై వి­చా­రణ చే­ప­ట్టా­రు.

బు­ధ­వా­రం ని­ర్వ­హిం­చిన వి­చా­ర­ణ­లో దానం నా­గేం­ద­ర్, కడి­యం శ్రీ­హ­రి తమ వాం­గ్మూ­లా­ల­ను సమ­ర్పిం­చా­రు. తాము ఇప్ప­టి­కీ బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ సభ్యు­లు­గా­నే ఉన్నా­మ­ని, పా­ర్టీ­ని అధి­కా­రి­కం­గా వి­డి­చి­పె­ట్ట­లే­ద­ని వారు స్ప­ష్టం చే­శా­రు. తాము కాం­గ్రె­స్ పా­ర్టీ­లో చే­రి­న­ట్లు ఎలాం­టి ప్ర­క­టన చే­య­లే­ద­ని కూడా తె­లి­పా­రు. వి­చా­రణ సం­ద­ర్భం­గా దానం నా­గేం­ద­ర్ కొ­న్ని ము­ఖ్య­మైన అం­శా­ల­ను స్ప­ష్టం­చే­శా­రు. కడి­యం శ్రీ­హ­రి కూడా ఇదే తర­హా­లో తన వా­ద­న­లు వి­ని­పిం­చా­రు. తాము ఇప్ప­టి­కీ బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­లో­నే ఉన్నా­మ­ని, అధి­కా­రి­కం­గా కాం­గ్రె­స్‌­లో చే­రి­న­ట్లు ఎలాం­టి ఆధా­రా­లు లే­వ­ని తె­లి­పా­రు. బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ నుం­చి తమకు ఎలాం­టి విప్ జారీ కా­లే­ద­ని కూడా వారు స్పీ­క­ర్ దృ­ష్టి­కి తీ­సు­కు­వ­చ్చా­రు. ఈ వాం­గ్మూ­లా­ల­ను స్పీ­క­ర్ పరి­శీ­లిం­చిన తరు­వాత ఇద్ద­రు ఎమ్మె­ల్యే­లు పా­ర్టీ మా­రి­న­ట్లు ని­ర్ధా­రిం­చే ఆధా­రా­లు లే­వ­ని తే­ల్చా­రు. దీం­తో స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ కు­మా­ర్ దానం నా­గేం­ద­ర్, కడి­యం శ్రీ­హ­రి పై దా­ఖ­లైన అన­ర్హత పి­టి­ష­న్ల­ను తి­ర­స్క­రిం­చా­రు. వా­రి­ని బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే­లు­గా­నే కొ­న­సా­గిం­చా­ల­నే ని­ర్ణ­యం ప్ర­క­టిం­చా­రు. ఈ ని­ర్ణ­యం­తో ఈ ఇద్ద­రు ఎమ్మె­ల్యే­ల­కు రా­జ­కీ­యం­గా ఊరట లభిం­చిం­ది.

Tags:    

Similar News