TG : యూట్యూబ్ ను చూస్తేనే రేవంత్ వణుకుతున్నారు : హరీశ్ రావు

Update: 2024-09-12 15:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్యూబ్ జర్నలిజం కామెంట్స్ ఇంకా రచ్చలేపుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు సీఎంపై మరోసారి కౌంటర్ ఎటాక్ చేశారు. యూట్యూబ్‌లను చూస్తే రేవంత్‌ రెడ్డికి వెన్నులో వణుకు పడుతోందని ఎద్దేవా చేశారు. ఫార్మాసిటీ, మెట్రో రైలు విష‌యంలో రేవంత్ రెడ్డి రూట్ మార్చారని హ‌రీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏ గ్రామానికి వెళ్లినా రూణ‌మాఫీ కాలేద‌ని చెబుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి తొంద‌ర‌ పాటు వ‌ల్ల స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు గ్రామాల‌కు వెళ్లలేని ప‌రిస్థితి ఏర్పడింది.

రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదని విమర్శించారు హరీశ్ రావు. 41 లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను, గ్రామాలను గాలికి వదిలేసి, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నారు. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను రేవంత్ రెడ్డి ఖ‌తం చేశారన్నారు. రియ‌ల్ ఎస్టేట్ పూర్తిగా ప‌డిపోయింద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

Tags:    

Similar News