Harish Rao : అందుకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే : హరీష్ రావు
Harish Rao : చేనేత కార్మికులకు కేంద్రం ఏం చేయలేదన్నారు మంత్రి హరీశ్‌రావు;
Harish Rao : చేనేత కార్మికులకు కేంద్రం ఏం చేయలేదన్నారు మంత్రి హరీశ్‌రావు. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చేనేత కార్మికులను రోడ్డున పడేసిందని విమర్శించారు.చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా చింత ప్రభాకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి.
చేనేత కార్మికులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ నివాసాన్ని అప్పటి ప్రభుత్వాలు కూల్చివేస్తే అదే స్థానంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు.కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్,పవర్ లూమ్ బోర్డ్ లను రద్దు చేసిందన్నారు.తమ ప్రభుత్వం నేతన్న భీమా కింద ఐదు లక్షల సహాయం అందిస్తుందని తెలిపారు.