మనుషుల జీవితాల కంటే మూసినది సుందరీ కరణే రేవంత్ రెడ్డికి ఎక్కువైపోయిందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్ రావు. 1 లక్ష 50 వేల కోట్లతో మూసి నదిని సుందరీకరణ చేసి ఏం చేస్తావు అని ప్రశ్నించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆటో కార్మికులకు యూనిఫామ్ లను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్రంలో 56 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదని హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి కూల్చడం తప్ప కట్టడం తెలియదన్నారు.