హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ హైకోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సఫిల్ గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్ దాఖలు చేయగా ...విచారణ చేపట్టిన హైకోర్టు HCA భాద్యతలు రిటైర్డ్ జడ్జి కి అప్పగించింది. తాజాగా మరో మూడు వారాల పాటు తన ఉత్తర్వులను పొడిగించాలని ఆదేశాలు జారీ చేసింది.
హెచ్సీఏ లో జరిగిన ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ సఫిల్ గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను మరో మూడు వారాలకు పొడిగించింది. కాగా ఈ నెల 19న జరిగిన వార్షిక సమావేశం చెల్లదని ప్రకటించడంతో పాటు హెచ్ సీఏ బాధ్యతలు బీసీసీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని సఫిల్ గూడ క్రికెట్ క్లబ్ హైకోర్టును కోరింది. ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన కోర్టు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం రిటైర్డ్ జడ్జి జస్టిస్ నవీన్ రావును నియమించిన సంగతి తెలిసిందే. ఆయన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మరో మూడు వారాల వరకు కొనసాగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అనంతరం తదుపరి విచారణ ను మూడు వారాలకు వాయిదా వేసింది.