Judicial Remand : హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌‌కు 14రోజుల రిమాండ్

Update: 2025-07-26 11:00 GMT

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా పలువురిని సీఐడీ అరెస్ట్ చేసింది. అయితే ఉప్పల్ సీఐ ఇచ్చిన సమాచారంతో దేవరాజ్ ఆ సమయంలో తప్పించుకున్నాడు. అప్పటి నుంచే పరారీలోనే ఉన్నాడు.

అతడి కోసం సీఐడీ 6బృందాలతో స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. 17 రోజుల్లోనే 7 రాష్ట్రాలు తిరిగిన దేవరాజును ఎట్టకేలకు పూణెలో అదుపులోకి తీసుకున్నారు. అతడు ఓ హోటల్లో తలదాచుకున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. నిందితుడిని ఇవాళ తెల్లవారుజామున న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో అతడిని జైలుకు తరలించారు.

Tags:    

Similar News