TS : తెలంగాణలో ఇవ్వాళ కొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు

Update: 2024-04-29 07:00 GMT

రెండ్రోజుల పాటు వడగాలు లు వీచే అవకాశముందని.. సోమ, మంగళవారాల్లో 41–46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో సోమవారం వడగాలులు వీచే అవకాశముందని వివరించింది.

ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే కొన్ని జిల్లాల్లో ఆ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో అత్యధికంగా 45.4 నమోదవగా.. దామరచర్ల, త్రిపురారం, కట్టంగూరు, హాలియా, నాంపల్లి మండలాల్లో 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రత రికార్డయింది.

ఇక ములుగు జిల్లా మంగపేట, భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో 45.3, భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగొరి, ములుగు జిల్లా ధర్మవరంలో 45.2, వనపర్తి జిల్లా పనగల్‌లో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో వడదెబ్బతో ముగ్గురు చనిపోయారు.

Tags:    

Similar News