TS WEATHER: మూడు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో రేపట్నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.;
తెలంగాణలో రేపట్నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.రేపు గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక గద్వాల జిల్లా చిన్నతండ్రపాడులో అత్యధికంగా 7.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లా లేజాలో 6.8, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో 6.1,గద్వాల జిల్లా సాత్రాలలో 4.5 సెం.మీ. వర్షం కురిసింది. హైదరాబాద్‌లో రాత్రి 7 గంటల తర్వాత జోరు వాన పడింది. నాంపల్లిలో 2.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఇక నైరుతి రుతుపవనాలు ఆరు రోజుల ముందే దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించినా సగం ప్రాంతాలు ఇంకా వర్షాభావంలోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తి బలహీనంగా ఉన్నాయి. దీంతో మధ్యభారతం దానికి ఆనుకుని దక్షిణ, తూర్పుభారతంలోని అనేక రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిశాయి.