రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి విస్తరించనుంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు రుతుపవనాలు విస్తరించాయి. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజులు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదరుగు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. గాలుల వేగం గంటకు 40-50 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో శుక్రవారం వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.