Heavy Rainfall : మరో రెండు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్‌లోనూ హై అలర్ట్

Update: 2024-09-04 13:00 GMT

రాష్ట్రంలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. రుతుపవన ద్రోణి జై సల్మేర్, ఉదయ్ పూర్ అల్పపీడనం కేంద్రంగా.. పశ్చిమ విదర్భ, రామగుండం, కళింగపట్నం, ఆగ్నేయ దిశగా తూర్పు బంగాళాఖాతం మీదుగా వెళ్తుందని, సముద్రమట్టానికి 8.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. కోస్తాంధ్ర, యానాం వరకు విస్తరించి ఉందని తెలిపింది.

గురువారం వరకు పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ వారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంబీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహూ బాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది.

అదేవిధంగా గురువారం కొమరంబీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలుపడే సూచనలున్నాయని పేర్కొంది.

Tags:    

Similar News