ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగాయి. రోడ్లపై వర్షపునీరు చేరింది. దీంతో రహదారులు చరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఖానాపురం మండలం నాజీతండా శివారులోని వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు పాకాల సరస్సు నిండుకుండలా మారింది. భారీ వర్షాలకు ములుగు, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
జంపన్నవాగు, జీడివాగు, దెయ్యాలవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో వైపు మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్ దెబ్బతింది. ఇంకోవైపు ఏటూరు నాగారం, వరంగల్ మధ్య జాతీయరహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.