తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు..మరో మూడు రోజులు ఏపీలోని ఆ 5 జిల్లాల్లో..

Heavy Rains: తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో సాధారణ జనజీవనం స్థంభించిపోయింది.

Update: 2021-07-22 02:54 GMT

Rains File Photo

Heavy Rains: తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. వర్షం కారణంగా వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

అల్పపీడన ప్రభావంతో కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రహదారులు మరింత అధ్వానంగా మారాయి. గుంతలలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఫలితంగా తెలుగు రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణాలోను ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. దినసరి కూలీలు, మధ్యతరగతి వారు ఇతర ప్రాంతాలను వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాలోను వర్షాలు పడుతున్నాయి.

హైదరాబాద్‌లోను ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్‌లోని మరోసారి లోతట్టుప్రాంతాలనికి భారీ వర్షాలు హైదరాబాద్‌ ప్రజలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు..లింగోజిగూడ డివిజన్ భాగ్యనగర్ కాలనీ ఫేజ్-2లో వరద నీటిని, డ్రైనేజీ నీటిని మోటార్లతో తోడేస్తూ నిత్యం నరకం అనుభవిస్తున్నారు. వర్షం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామన్నారు. 

వరంగల్‌లోనూ ఏకధాటిగా వర్షం కురుసింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కిందకు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..హైదరాబాద్‌ సమీపంలోని జంట జలాశయాలు పూర్తస్థాయి మట్టానికి చేరుకున్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట జలాశయాలు పూర్తిగా జలకళ సంతరించుకుంది.

కరీంనగర్‌లో స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా కాలువల కోసం తీసిన గుంతల్లో నీరు చేరింది. మంకమ్మతోట లేబర్‌ అడ్డ వద్ద గ్యారేజ్‌ పక్కన డ్రైనేజీ కుంగిపోయింది. గ్యారేజీలో కారు, బైక్‌ పడిపోయాయి. సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు ఉప్పొంగి ప్రవహరిస్తోంది. వాగు జలకళ సంతరించుకోవడంతో గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట జలాశయం జలకళను సంతరించుకుంది.

ప్రస్తుతం గండిపేట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం1784.70 అడుగులు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీపరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.. గేట్లు ఎత్తారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది..నాలుగు అలుగుల ద్వారా నీరు ప్రవహిస్తోంది. రిజర్వాయర్ నిండటంతో 25వేల ఎకరాల్లో పంటలు సాగుచేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో పనులకు ఆటంకం ఏర్పడింది. 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మంచిర్యాల జిల్లాలో 4 సింగరేణి ఉపరితల గనుల్లో వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని, రామకృష్ణాపూర్ ఉపరితల గనుల్లో 12 వేల టన్నుల బొగ్గు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం, శ్రీరాంపూర్ ఓసీల్లో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి జిల్లా తాడిచర్ల ఓపెన్ కాస్టులోకి వరద నీరు చేరింది.


Tags:    

Similar News