తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

Heavy rains రానున్న 48 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Update: 2021-07-14 02:32 GMT

Heavy rains file Image 

Rain Updates: అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వరంగల్‌ గ్రామీణ జిల్లా చెన్నారావుపేటలో అత్యధికంగా 14 సెంటిమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 11.8 సెం.మీ వర్షపాతం నమోదయింది. గత మూడు రోజులుగా కురస్తున్న వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఉదయం నుంచే భారీ నుంచి అతి భారీ వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి సమృద్ధిగా వరదనీరు చేరుతోంది.

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురిసాయి. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కురిసిన వర్షాలతో వాగులు పొంగిపోర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరుచేరుతోంది. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రేటర్‌లో గత రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.

రానున్న 48 గంటల్లోరెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News