Crops : అడుగంటిన భూగర్భజలాలు .. ఎండుతున్న పంటలు

Update: 2024-03-26 06:58 GMT

భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. రెండు మూడు బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరుతడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

చిగురుమామిడి మండలం బొమ్మెనపల్లికి చెందిన ఈ రైతు పేరు చట్ల మొగిలి. ఆయన సాగుకు ఆధారమైన వ్యవసాయ బావి పూర్తిగా అడుగంటింది. దీంతో ఆయన రూ.30 వేలు ఖర్చు పెట్టి ఇటీవల క్రేన్ సాయంతో 2 గజాల్లోతు పూడిక తీయించాడు. అయినా ఫలితం దక్కలేదు. సాగు చేసిన 4 ఎకరాల వరి పంటకు బావిలో నీరు సరిపోవడం లేదు. దీంతో రెండున్నర ఎకరాలు ఎండిపోయింది.

గ్రౌండ్​ వాటర్‌‌‌‌ లెవల్స్‌‌ (మీటర్లలో) ఫిబ్రవరి నెలలో

మండలం 2023 2024

రామడుగు 8.31 11.85

చిగురుమామిడి 7.05 11.32

కొత్తపల్లి 7.11 10.65

తిమ్మపూర్ 9.85 10.26

గన్నేరువరం 7.17 8.35

హుజూరాబాద్ 5.45 7.71

కరీంనగర్ 7.40 7.45

ఇల్లందకుంట 5.95 7.07

Tags:    

Similar News