Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్..

Update: 2025-08-13 16:30 GMT

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచింది. ఈ క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలకు కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిఘా వర్గాలు హై అలెర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఎయిర్ పోర్టుకు సందర్శన కోసం వచ్చే వాళ్లకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు అనుమానితుల పట్ల సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. విదేశాల నుంచి హైదరాబాద్ కు నేరుగా విమానాలు వస్తున్న నేపథ్యంలో చెకింగ్ ను ముమ్మరం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో ఎయిర్ పోర్టు అంతటా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు కు వచ్చే ప్రతీ ప్రయాణికున్ని తనిఖీ చేస్తున్నారు. కాగా ఈ హైఅలర్ట్ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News