HIGH ALERT: అప్రమత్తంగా ఉన్నాం... అన్ని చర్యలు తీసుకున్నాం

భారీ వర్షాల నేపథ్యంలో మంత్రుల ప్రకటన... బాధితులకు అండగా ఉంటామన్న మంత్రులు... కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు....;

Update: 2025-08-28 06:15 GMT

తె­లం­గాణ వ్యా­ప్తం­గా వర్షాల నే­ప­థ్యం­లో అన్ని శాఖల అధి­కా­రు­లు, సి­బ్బం­ది అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి ఆదే­శిం­చా­రు. పాత ఇళ్ల­లో ఉం­డే­వా­రి­ని సు­ర­క్షిత ప్రాం­తా­ల­కు తర­లిం­చా­ల­న్నా­రు. వి­నా­య­‌క మం­డ­‌­పాల స‌­మీ­పం­లో ఉన్న వి­ద్యు­త్ స్తం­భా­లు, ట్రా­న్స్‌­ఫా­ర్మ­ర్ల­తో భ‌­క్తు­ల­‌­కు ప్ర­మా­దం బా­రి­న­ప­డ­కుం­డా త‌గు జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­ల­న్నా­రు. హై­ద­‌­రా­బా­ద్‌­లో హై­డ్రా, జీ­హె­చ్ఎం­సీ, ఎస్డీ­ఆ­ర్ఎ­ఫ్‌, అగ్ని­మా­ప­‌­క‌, పో­లీ­సు సి­బ్బం­ది స‌­మ­‌­న్వ­యం చే­సు­కుం­టూ పని­చే­యా­ల­ని చె­ప్పా­రు. నదు­లు, వా­గు­ల­పై నీ­టి­ప్ర­వా­హం ఉంటే అటు వైపు రా­క­పో­క­లు ని­షే­ధిం­చా­ల­ని ఆదే­శిం­చా­రు. అం­టు­వ్యా­ధు­లు ప్ర­బ­ల­కుం­డా నగర, పు­ర­పా­లక, గ్రామ పం­చా­య­తీ అధి­కా­రు­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­న్నా­రు. ఆసు­ప­‌­త్రు­ల్లో స‌­రి­ప­‌­డా మం­దు­లు అం­దు­బా­టు­లో ఉం­చా­ల­ని, అవ­‌­స­‌­ర­‌­మైన చోట వై­ద్య శి­బి­రా­లు ఏర్పా­టు చే­యా­ల­న్నా­రు.

తె­లం­గాణ వ్యా­ప్తం­గా భారీ వర్షా­లు కు­రు­స్తు­న్న నే­ప­థ్యం­లో మం­త్రు­లు పొం­గు­లే­టి శ్రీ­ని­వా­స్ రె­డ్డి, సీ­త­క్క, ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి వే­ర్వే­రు­గా స్పం­దిం­చా­రు. కా­మా­రె­డ్డి, మె­ద­క్ జి­ల్లా­లో ఎడ­తె­రి­పి లే­కుం­డా కు­రు­స్తు­న్న వర్షా­ల­పై రా­ష్ట్ర ప్ర­భు­త్వం చాలా అల­ర్ట్ గా ఉం­ద­ని.. ప్ర­జ­ల­కు అన్ని వి­ధా­లు­గా సహాయ, సహ­కా­రా­లు అం­ది­స్తు­న్న­ట్టు తె­లి­పా­రు పొం­గు­లే­టి శ్రీ­ని­వా­స్ రె­డ్డి. కా­మా­రె­డ్డి, మె­ద­క్ జి­ల్లాల కలె­క్ట­ర్ల­ను ఇప్ప­టి­కే ఆదే­శిం­చా­మ­ని.. ఎన్డీ­ఆ­ర్ ఎఫ్‌ బృం­దా­ల­ను ఆ జి­ల్లా­ల­కు పం­పిం­చా­మ­న్నా­రు మం­త్రి శ్రీ­ని­వా­వ­స్ రె­డ్డి. సీఎం రే­వం­త్ రె­డ్డి సూ­చ­నల మే­ర­కు ఎప్ప­టి­క­ప్పు­డు ఆయా జి­ల్లా అధి­కా­రు­ల­తో మా­ని­ట­రిం­గ్ చే­స్తు­న్న­ట్టు వె­ల్ల­డిం­చా­రు. కలె­క్ట­ర్ల­తో మం­త్రి పొం­గు­లే­టి శ్రీ­ని­వా­స్ రె­డ్డి టెలీ కా­న్ఫ­రె­న్స్ ని­ర్వ­హిం­చి పలు సూ­చ­న­లు చే­శా­రు. లో­త­ట్టు ప్రాం­తాల ప్ర­జ­ల­ను సు­ర­క్షిత ప్రాం­తా­ల­కు తర­లిం­చి, అవ­స­ర­మైన ప్రాం­తా­ల్లో పు­న­రా­వాస కేం­ద్రా­ల­కు తర­లిం­చి తగిన భోజన వసతి, వై­ద్య సదు­పా­యం ఏర్పా­టు చే­యా­ల­న్నా­రు. మం­త్రి సీ­త­క్క మా­ట్లా­డు­తూ గతం­లో ఎన్న­డూ కు­ర­వ­ని వర్షా­లు ఈ సారి మె­ద­క్, కా­మా­రె­డ్డి­లో కు­రి­శా­య­ని.. అన్ని చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­మ­న్నా­రు. పో­చా­రం ప్రా­జె­క్ట్ తెగే ప్ర­మా­దం ఉం­ద­ని.. ఆ వి­ష­యం­లో అధి­కా­రు­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­న్నా­రు. లో­త­ట్టు ప్రాం­తాల ప్ర­జ­ల­ను అలె­ర్ట్ చే­శా­మ­న్నా­రు. అన్ని రకా­లు­గా ప్ర­భు­త్వ సహాయ, సహ­కా­రా­లు అం­ది­స్తా­మ­ని మం­త్రి ఉత్త­మ్‌­కు­మా­ర్‌­రె­డ్డి వె­ల్ల­డిం­చా­రు. అధి­కా­రు­లం­ద­రూ అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని... ప్ర­జ­ల­కు ఇబ్బం­దు­లు లే­కుం­డా చర్య­లు తీ­సు­కో­వా­ల­ని ఆదే­శిం­చా­రు.

రైళ్ల రాకపోకలు రద్దు..

కా­మా­రె­డ్డి జి­ల్లా­లో గతం­లో ఎన్న­డూ లే­నంత భారీ వర్షా­లు కు­రు­స్తు­న్నా­యి. ఎక్క­డి­క­క్కడ భా­రీ­గా వరద నీరు ని­లి­చి­పో­యిం­ది. రై­ల్వే ట్రా­కు­లు ము­ని­గి­పో­యా­యి. దీం­తో రెం­డు రై­ళ్ల రా­క­పో­క­ల­ను రద్దు చే­శా­రు అధి­కా­రు­లు. మధ్యా­హ్నం ని­జ­మా­బా­ద్ నుం­చి తి­రు­ప­తి­కి వె­ళ్లా­ల్సిన రా­య­ల­సీమ రై­లు­ను, కా­చి­గూడ నుం­చి మె­ద­క్ వె­ళ్లే రై­లు­ను కూడా రద్దు చే­శా­రు అధి­కా­రు­లు. కా­మా­రె­డ్డి­లో దా­దా­పు 10 కా­ల­నీ­లు నీ­టి­లో ము­ని­గా­యి. జి­ల్లా కేం­ద్రం­లో అశో­క్ నగర్ కా­ల­నీ­లో రై­ల్వే గేటు వద్ద వరద ఉధృ­తం­గా ప్ర­వ­హి­స్తోం­ది. దీం­తో రై­ల్వే గేటు కా­స్త ము­ని­గి­పో­యిం­ది. అటు పట్ట­ణం­లో­ని హౌ­సిం­గ్ బో­ర్డు కా­ల­నీ నిం­డా ము­ని­గిం­ది. ఇక్కడ కా­ర్లు కూడా కొ­ట్టు­కు­పో­తు­న్నా­యం­టే వరద ఏ స్థా­యి­లో ప్ర­వ­హి­స్తుం­దో అర్థం చే­సు­కో­వ­చ్చు. వా­గు­లు, వంకల స్థా­యి­లో వరద నీరు పట్ట­ణం­లో ప్ర­వ­హి­స్తోం­ది.

తె­లం­గాణ వ్యా­ప్తం­గా వి­స్తా­రం­గా వర్షా­లు కు­రు­స్తు­న్న నే­ప­థ్యం­లో ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి అన్ని శాఖల అధి­కా­రు­లు, సి­బ్బం­ది­ని అప్ర­మ­త్తం చే­శా­రు. ప్ర­జ­ల­కు ఎక్క­డా ఇబ్బం­దు­లు కల­గ­కుం­డా చర్య­లు చే­ప­ట్టా­ల­ని ఆదే­శిం­చా­రు. పు­రా­తన ఇళ్ల­లో ఉం­టు­న్న వా­రి­ని తక్ష­ణ­మే సు­ర­క్షిత ప్రాం­తా­ల­కు తర­లిం­చా­ల­ని అధి­కా­రు­ల­కు సీఎం సూ­చిం­చా­రు.

Tags:    

Similar News