TG High Court : అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్ల మీద హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన వాదనల సందర్భంగా యాక్టర్ అయినంత మాత్రాన అతడిని ఇరికించొచ్చా? అని వ్యాఖ్యానించింది. సామాన్య పౌరుడికి వర్తించే మినహా యింపులను నిరాకరించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నటుడు కాబట్టి 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను ఆపాదించాలా? ఒకరు చనిపోవడంపై తమకు కూడా బాధగా ఉంది అదే సమయంలో అల్లు అర్జున్కు కూడా జీవించే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. శుక్రవారం రాత్రి పత్రాల పరిశీలనకు సమయం లేకపోవడంతో అల్లు అర్జున్ ఈ ఉదయం 6 గంటల తర్వాత విడుదలయ్యారు.