TG High Court : కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు: హైకోర్టు

Update: 2025-08-13 15:30 GMT

కాళేశ్వరం ప్రాజెక్టు పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని, దానికి సంబంధించిన నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2023 సంవత్సరంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వరదల కారణంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అమలు చేసి, కాళేశ్వరం రక్షణ కోసం చర్యలు చేపట్టాలని హైకోర్టులో చెరుకు సుధాకర్, ఇతర వ్యక్తులు పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ విచారిస్తూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 39 ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో కాళేశ్వరం రక్షణకు చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను ఎంత వరకు అమలు చేశారో నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ ఆదేశించారు.

Tags:    

Similar News