TG: రాబోయే మూడు రోజులు భగభగలే
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక;
రాబోయే మూడు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. సోమ, మంగళ, బుధవారాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇప్పటికే భద్రాచలం, ఆదిలాబాద్, మెదక్, రామగుండంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం పడిపోవడం వల్ల వేడి తీవ్రత ఎక్కువైందని వివరించింది. వచ్చే మూడు రోజులలో గరిష్టంగా ఉష్ణోగ్రతలో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ నాగరత్న తెలిపారు. రాబోయే మూడు రోజులలో అక్కడక్కడ ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35డిగ్రీల నుంచి 21 డిగ్రీల వరకు ఉంటాయని వెల్లడించారు. ఉపరిత గాలులు వాయువ్వ దిశగా గంటకు 4 నుంచి 6కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. గరిష్టంగా ఉష్ణోగ్రత 33.4డిగ్రీలు, కనిష్టంగా 21.2డిగ్రీలు వాతావరణం నమోదు అయింది. గాలిలో తేమ 071 శాతంగా నమోదైందని నాగరత్న తెలిపారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం అత్యధికంగా భద్రచలంలో –38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే భద్రాచలం, ఆదిలాబాద్, మెదక్, రామగుండం ప్రాంతాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. వడదెబ్బ సమస్యల నుంచి రక్షించుకునేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మార్చిలో అధిక ఉష్ణోగ్రతలు: IMD
మార్చిలో దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని, దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా.. దేశంలో 1901 తర్వాత ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ పేర్కొన్నారు.
శతాబ్దం తర్వాత అంతటి ఉష్ణోగ్రతలు
శతాబ్దం తర్వాత దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 1901 తర్వాత ఈ ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఫిబ్రవలో 22 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత హై టెంపరేచర్ మంత్ గా ఈ ఏడాది ఫిబ్రవరి నిలిచింది.