Jishnu Dev Verma : గోరటి వెంకన్నకు, ప్రేమ్ రావత్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

Update: 2025-09-30 13:15 GMT

డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. సాహిత్యం, కళా రంగాల్లో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గాను గోరేటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ అందించారు. ప్రముఖ శాంతి విద్యా ప్రచారకుడు అయిన ప్రేమ్ రావత్‌కు పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచడం, నేరాల శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నందుకు గాను గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు.

పట్టాలు, పతకాల ప్రదానం  ఈ స్నాతకోత్సవంలో 86 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలను గవర్నర్ అందజేశారు. అలాగే మొత్తం 60,288 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, 203 మంది ఖైదీలకు డిగ్రీ పట్టాలు ఇచ్చారు. ఈ ఖైదీలలో ఇద్దరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలను అందుకున్నారు.

Tags:    

Similar News