మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ సప్లై చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టు లో జరిగిన తనిఖీల్లో భారీగా గంజాయి లభ్యమైంది. ఈ గంజాయి విలువ సుమారు రూ.14 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎయిర్ పోర్టులో డీఆర్ఎ అధికారులు జరిపిన తనిఖీల్లో భాగంగా...బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సయ్యద్ రిజ్వీ అనే వ్యక్తి లగేజ్ లో 13.9 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. గంజాయి సప్లై చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.