Jangaon District : ఇద్దరు భార్యల చేతిలో భర్త హతం...జనగామ జిల్లాలో దారుణం

Update: 2025-07-08 12:30 GMT

జనగామ జిల్లాలో దారుణం జరిగింది ఇద్దరు భార్యలు కలిసి ఓ భర్తను కడతేర్చారు. తమ తల్లిని పొట్టన పెట్టుకున్న భర్తకు గుణపాఠం చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం లింగాల గణపురం మండలం ఎనబావి గ్రామ శివారు పిట్టలోని గూడెంలో ఈ ఘటన జరిగింది. కాలియా కనకయ్య(30) అనే వ్యక్తికి శిరీష, గౌరమ్మ లు ఇద్దరు భార్యలు. ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. మద్యానికి బానిసైన కనకయ్య నిత్యం తన భార్యలను వేధిస్తుండేవాడు. తాగిన మైకం లో మే 18 న తన సొంత అక్క నే హత్య చేశాడు. అప్పటినుండి పరారీలో ఉన్న కనకయ్య అప్పుడప్పుడు గ్రామానికి వస్తు తన భార్యలనే కాకుండా ఇరుగుపొరుగు వారిని కూడా భయబ్రాంతులకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి గొడ్డలితో తన భార్యలను బెదిరించాడు. దీంతో ఎదురు తిరిగిన అక్క చెల్లెలు అదే గొడ్డలితో భర్తను కడతేర్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News