Huzurabad by election: హుజురాబాద్‌ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Huzurabad by election: హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 30న పోలింగ్‌ జరుగుతుంది.

Update: 2021-09-28 04:50 GMT

Huzurabad by election: హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 30న పోలింగ్‌ జరుగుతుందని, నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు అసెంబ్లీలకు సంబంధించిన ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న విడుదల చేస్తారు. అక్టోబర్‌ 8 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చింది. అక్టోబర్‌ 11న నామినేషన్లు పరిశీలిస్తారు

దసరా పండగ వస్తున్నందున కరోనా విజృంభించే అవకాశం ఉందని, పండగలు అయిపోగానే ఉప ఎన్నిక పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు ఉప ఎన్నికను కొంత కాలం వాయిదా వేసింది. ప్రస్తుతం కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టడంతో.. హుజురాబాద్‌, బద్వేల్‌ నియోజకవర్గాలకు షెడ్యూల్‌ విడుదల చేసింది.

Tags:    

Similar News