Huzurabad: ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. బీజేపీ..

Huzurabad: హుజూరాబాద్‌లో దళితబంధును మొదట ప్రకటించిన సాలపల్లి గ్రామంలో బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

Update: 2021-11-02 05:51 GMT

Huzurabad: మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానే బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యత సాధించిన టీఆర్ఎస్ పార్టీ.. ఈవీఎం లెక్కింపు మొదలైన తరువాత ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్‌లో మొత్తం 723 ఓట్లు పోల్ అవగా.. టీఆర్ఎస్‌కు 503, బీజేపీకి 159 ఓట్లు వచ్చాయి.

ఇక తొలి రౌండ్‌లో హుజూరాబాద్ మండల కేంద్రానికి సంబంధించిన ఓట్లు లెక్కించారు. ఇందులో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఫస్ట్‌ రౌండ్‌లో బీజేపీకి 4వేల 610, టీఆర్ఎస్‌కు 4వేల 444, కాంగ్రెస్‌కు 119 ఓట్లు వచ్చాయి.

రెండో రౌండ్‌లనూ ఈటలకే ఆధిక్యత వచ్చింది. హుజూరాబాద్‌లో దళితబంధును మొదట ప్రకటించిన సాలపల్లి గ్రామంలో బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. సెకండ్ రౌండ్‌లో వీణ‌వంక‌, జ‌మ్మికుంట‌, ఇల్లంద‌కుంట‌, క‌మ‌లాపూర్ మండ‌లాల‌ ఓట్లు లెక్కించారు. రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 4వేల 947, బీజేపీకి 4వేల 769 ఓట్లు వచ్చాయి.

రెండో రౌండ్‌ ముగిసేసరికి ఈటలకు 193 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యంతో ఈటలకే ఎడ్జ్‌ వచ్చింది. మూడో రౌండ్ ముగిసే సరికి ఈటలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిపై 1273 ఓట్ల లీడ్ వచ్చింది. మూడో రౌండ్‌ కౌంటింగ్ అయ్యాక బీజేపీకి 13వేల 525 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 12వేల 262 ఓట్లు వచ్చాయి.

Similar News