Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

Update: 2025-05-17 08:00 GMT

హైదరాబాద్ పోలీసులకు అం తర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్ లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో సిటీ పోలీసులు ప్రతిష్టాత్మ కమైన అవార్డును కైవసం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీనార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డును హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు. ఈ అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్ 2025కు ప్రపంచంలోని 138 దేశాల నుంచి ప్రముఖ పోలీసు అధికారులు హాజరయ్యారు. వారి మధ్య హైదరాబాద్ పోలీసులు మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవా ర్డును సాధించడంలో నార్కోటిక్ వింగ్ లోని అధికారులు, సిబ్బంది అంకితభావం, కృషి ఎంతో ఉందని కొనియాడారు. వారి నిరంతర ప్రయత్నాల వల్లే ఈ విజయం సాధ్యమైంద న్నారు. అంతేకాకుండా, ఈ విజయం కేవలం తెలంగాణ పోలీసులకు మాత్రమే కాకుండా, యావత్ భారతదేశ పోలీసు దళానికి గర్వకార ణమని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Tags:    

Similar News