Hyderabad Rainbow Hospital : రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌ సరికొత్త రికార్డ్.. దేశంలోనే మొదటిసారి..

Hyderabad Rainbow Hospital : దేశంలోనే మొట్టమొదటిసారి అంబులెన్స్‌లో నైట్రిక్‌ ఆక్సైడ్‌ గ్యాస్‌తో హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్‌ ఆరంభించి నవజాత శిశువులను కాపాడుతుంది రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌;

Update: 2022-10-07 09:11 GMT

Hyderabad Rainbow Hospital : దేశంలోనే మొట్టమొదటిసారి అంబులెన్స్‌లో నైట్రిక్‌ ఆక్సైడ్‌ గ్యాస్‌తో హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్‌ ఆరంభించి నవజాత శిశువులను కాపాడుతుంది రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీలలో నవజాత శిశువులు, చిన్నపిల్లల అత్యవసర రవాణా సేవలను రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ప్రారంభించింది.

అత్యవసర ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలను సైతం రెయిన్‌బో అందిస్తుంది. జిల్లా హాస్పిటల్‌లో బేబీ మెహ్రీన్‌ ఫాతిమా ఆరోగ్యవంతంగా 2.7 కేజీల బరువుతో పుట్టింది. కానీ కొన్ని గంటల తరువాత ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ శిశువుకు గుండెలో సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు అనుమానించారు. తక్షణమే ఆమెను హైదరాబాద్‌లోని కార్డియాక్‌ సెంటర్‌కు పంపించారు.


శిశువు ఆక్సిజన్‌ స్ధాయి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు డాక్టర్లు ఆ శిశువు గుండెలో రంధ్రాలు సైతం ఉన్నాయని గుర్తించారు.ఇలాంటి వారికి హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌ను శ్వాస ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ శిశువుకు అత్యాధునికమైన లెవల్‌-4 ఎన్‌ఐసీయు కలిగిన బంజారాహిల్స్‌ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ వంటి చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ అవసరమైంది. అన్ని సదుపాయాలు రెయిన్‌బో అంబులెన్స్‌కు ఉన్నాయి.


ఆ శిశువుకు నైట్రిక్‌ ఆక్సైడ్‌ గ్యాస్‌ను సైతం అందించారు. ఇది ఆమె ప్రాణాలను కాపాడటంతో పాటుగా ఆక్సిజన్‌ స్థాయిలు మెరుగుపడేందుకు సహాయపడింది. రెయిన్‌బో నియోనాటల్‌ ఐసీయుకు చేరుకున్న తరువాత ఆమెకు వైద్యం చేసి డిశ్చార్జ్‌ చేశామన్నారు డాక్టర్‌ దినేష్‌కుమార్‌ చిర్లా.

Tags:    

Similar News