Wines Shops Closed : రెండురోజుల పాటు హైదరాబాద్ లో వైన్స్ బంద్

Update: 2024-09-13 09:45 GMT

హైదరాబాద్ సిటీలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూతబడనున్నాయి. వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో లిక్కర్​ అమ్మకాలపై పోలీసులు నిషేధం విధించారు. 17న ఉదయం 6 గంటల నుంచి 18న సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సిటీ సీపీ సీవీ ఆనంద్​ ఆదేశించారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

స్టార్ హోటల్స్‌‌‌‌, రెస్టారెంట్ల లోని బార్లను కూడా మూసివుంటాయని స్పష్టం చేశారు. రూల్స్‌ కు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాలని పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు.

Tags:    

Similar News