యాకుత్‌పురాలో ఐదేళ్ల బాలిక పాఠశాలకు వెళ్తూ ప్రమాదవశాత్తూ మ్యాన్ హోల్లో పడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆ బాలికను నాయనమ్మ, స్థానికులు సురక్షితంగా కాపాడారు. హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శలు రావడంపై రంగనాథ్ స్పందించారు. హైడ్రా వల్లే తప్పు జరిగిందని గుర్తించామని, ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘‘నగరంలో ఉన్న మ్యాన్‌హోల్స్‌పై ఆడిట్ చేస్తున్నాం. మూతలు సరిగాలేనివి గుర్తించి.. సంబంధిత ఏజెన్సీకి సెక్రటరీ ద్వారా రిఫర్ చేస్తాం. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హైడ్రా మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదు. బ్లేమ్ గేమ్ కాకుండా సమన్వయంతో ముందుకెళ్లాలి. యాకుత్‌పురా ఘటనపై రాజకీయపరంగా చేసే విమర్శలపై స్పందించను. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి నిన్న జరిగిన ఘటనకు బాధ్యుడు.. అతనిపై చర్యలు తీసుకుంటాం." అని రంగనాథ్ తెలిపారు.
బతుకమ్మ పండగ అక్కడే..
అన్ని విభాగాలకు బాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారని, మాకు శాంక్షన్ అయిన బడ్జెట్ లో ఒక క్వార్టర్ ది మాత్రమే రిలీజ్ అయిందని తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్ లో త్వరలో కేసులు నమోదు చేస్తామన్నారు. సున్నం చెరువులో పనులు ఆపమని కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ లేదన్నారు. బతుకమ్మ కుంట పనులు పూర్తవబోతున్నాయని, త్వరలో సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తామని చెప్పారు. ఈసారి బతుకమ్మ పండగ అక్కడ జరిగేలా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.
మూడు రోజులు భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బయటకు వచ్చేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.